ప్రభాస్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన అజిత్!

తమిళ స్టార్‌ అజిత్‌ , బాహుబలి ప్రభాస్‌ను సర్‌ప్రైజ్‌ చేశారట. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ‘సాహో’. రామోజీలో షూటింగ్ జరుగుతుంది. ఆర్ ఎఫ్ సీలో అజిత్ సినిమా షూటింగ్ కూడా సాగుతూ ఉండటం, ఆ సమీపంలోనే ‘సాహో’ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో అజిత్ అక్కడ ప్రత్యక్షం అయినట్టుగా తెలుస్తోంది.

దీంతో ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌ అయినట్లు సమాచారం. కొన్ని గంటలపాటు ఇద్దరు స్టార్లు మాట్లాడుకున్నట్లు తెలిసింది. అజిత్‌ వ్యక్తిత్వం తెలుసుకున్న ప్రభాస్‌ ఆయన్ను చాలా ప్రశంసించినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌, అజిత్‌ కలిసి ఫొటోలు తీసుకున్నారని, కానీ కొన్ని నిబంధనల వల్ల వాటిని బయటపెట్టలేదని చెబుతున్నారు. హిందీలో హిట్ అయిన ‘పింక్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. దానికోసమే అజిత్ అక్కడకు వచ్చారు.