ఒకే వేడుకలో ప్రభాస్ – అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు ఒకే వేడుకలో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. హీరో గోపీచంద్ చిన్న కొడుకు వియాన్ మొదటి పుట్టిన రోజు వేడుక నిన్న రాత్రి హైదరాబాద్ లోని గోపిచంద్ నివాసంలో వైభవం గా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్, ప్రభాస్ లతో పాటు సినీ ప్రముఖులంతా హాజరై వేడుకకు మరింత కళ తీసుకొచ్చారు. గోపిచంద్ కు ప్రభాస్ , బన్నీ లు మంచి మిత్రులు కావడంతో గోపి ఆహ్వాననించగానే వెంటనే వచ్చారు. వీరిద్దరూ వియాన్ జన్మదిన వేడుకకు విచ్చేసి ఆశీర్వదించడంతో పాటు, శుభాకాంక్షలు తెలిపారు.

ఇక గోపీచంద్ 2013లో హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను వివాహం చేసుకోగా వారికి ఇద్దరు సంతానం. మొదటి కొడుకు పేరు విక్రమ్ కృష్ణ కాగా చిన్న కుమారుడు వియాన్. ప్రస్తుతం గోపీచంద్ చాణక్య అనే సినిమాలో నటిస్తున్నాడు. మెహ‌్రీన్ హీరోయిన్ కాగా యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ గా తెరకెక్కుతుంది. తమిళ దర్శకుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .