వైరల్ గా మారిన ప్రభాస్ సీడీపీ

అక్టోబర్ 23 న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భాంగా అభిమానులకు అసలు సిసలైన కిక్ ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు చిత్ర దర్శక , నిర్మాతలు. అంతకన్నా ముందే అభిమానులు ప్రభాస్ సీడీపీతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఇక సంబరాలు షురూ అంటూ ప్రభాస్ రేంజ్ తెలిపేలా బర్త్ డే సీడీపీని బయటకు వదిలారు. ఈ బర్త్ డే సీడీపీని పరిశీలిస్తే.. ఇందులో అశేష అభిమానుల నడుమ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్‌ని చూపిస్తూ వరల్డ్ స్టార్ కీర్తిని చాటిచెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. దీంతో ఈ సీడీపీ నెట్టింట వైరల్ అవుతోంది. ఆయనకు పెద్ద ఎత్తున అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. మూడు రోజుల ముందే అభిమానుల సందడి ఇలా ఉంటె..అసలైన రోజు ఇంకా ఎలా ఉంటుందో అని అంత మాట్లాడుకుంటున్నారు.