రామాయణంలో బాహుబలి కూడా..?

ఇటీవల పౌరాణిక చిత్రాలకు మంచి ఆధరణ లభిస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు ఇలాంటివి చేయడానికి ఉత్సాహాన్ని కనబర్చుతున్నారు. ఇప్పటికే సురేష్‌ ‘హిరణ్య కశప’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్‌ ‘రామాయణం’ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ‘రామాయణం’లో రాముడిగా హృతిక్‌ రోశన్‌, సీతగా దీపికా పదుకునేను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక చిత్ర యూనిట్‌ రావణుడి పాత్ర కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

‘బాహుబలి’, ‘సోహా’ చిత్రాలతో తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రభాస్‌ మంచి పేరును సొంతం చేసుకున్నారు. దాంతో ఈ బాహుబలిని రావణుడి పాత్ర కోసం తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్టు సమాచారం. నటనతో పాటు క్రేజ్‌ ప్రభాస్‌కు తెలుగు, హిందీలలో మెండుగా ఉన్నాయి. దాంతో రావణుడి పాత్రకు ప్రభాస్‌ పూర్తి న్యాయం చేయగలడు అని చిత్ర యూనిట్‌ భావిస్తున్నారు. అయితే ప్రభాస్‌ ఓకే చెప్పాడా? అనేది తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.