ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం చూస్తున్న ప్రభాస్..

బాహుబలి చిత్రం తో ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు ప్రభాస్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలవరకు తెలుసు..కానీ బాహుబలి తర్వాత వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఈయన తో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శకులు , నిర్మాతలు పోటీ పడుతున్నారు.

అంతే కాదు భారీ చిత్రాలు ప్రస్తుతం లైన్లో ఉన్నాయి. అయితే ప్రభాస్ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ కోసం చూస్తున్నాడట. ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ యాక్షన్ భరిత చిత్రాలే కావడం తో ఫ్యామిలీ ఆడియన్స్ ప్రభాస్ నుండి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోరుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ కోసం ప్రభాస్ ట్రై చేస్తున్నాడట.