హాలీవుడ్ లో మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక

బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా యావత్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక చోప్రా…పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. ఈ ఇద్దరు అమెరికా లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ భామ ఓ హాలీవుడ్ మూవీ లో నటించబోతున్నట్లు తెలిపింది.

2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫ‌ర్ డిచ్ రీమేక్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు స్వయంగా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. టెక్ట్స్ ఫ‌ర్ యూ పేరుతో రానున్న ఈ మూవీలో ప్రియాంకాకు హీరోయిన్‌గా నటించనున్నారు. అద్భుతమైన వ్యక్తులతో, అమోఘమైన సినిమాలో నటించడం చాలా సంతోషంగా, ఇది తనకు గొప్ప గౌరవంగా ఉందని ఆమె వెల్లడించారు. దీంతో ప్రియాంకాకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఆమె భర్త నిక్ జోనస్ కూడా ఫైర్ ఎమోజీని పోస్ట్ చేయడం విశేషం.