పూరి మనసులో ఏ కోరిక ఉందో తెలుసా..?

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లన్ని బంద్ కావడం తో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో డాషింగ్ డైరెక్టర్ పూరి..’పూరీ మ్యూజింగ్స్` పేరుతో వివిధ అంశాలపై తన ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

తాజాగా ద్వీపం (ఐలాండ్) గురించి చెప్పుకొచ్చారు. నాకో చిన్న కోరిక ఉంది. మనుషులు లేని ద్వీపంలో ఓ కుక్కతో కలిసి కనీసం ఓ నెలరోజులైనా ఒంటరిగా ఉండాలి. ఇంటర్నెట్, కమ్యూనికేషన్ ఉండకూడదు. ఓ చిన్న గుడిసె వేసుకుని కుక్క పక్కన పడుక్కోవాలి. అడవిలో జంతువుల్లా ఉండాలి. వర్షం వచ్చినప్పుడు తడవాలి. 40 ఏళ్లకు పైగా ఒంటరిగా బతికిన వాళ్లు నాకు తెలుసు. మాల్దీవులు వెళ్లినపుడు ఈ ఐడియా గుర్తుకు వచ్చింది. 24 గంటలపాటు ప్రయత్నించా. చుట్టూ సముద్రం.. మధ్యలో అర ఎకరా నేల.. అందులో నేను అంటూ తన అనుభవాలను పంచుకున్నారు. View this post on Instagram

‪? https://youtu.be/MUW-sh4HV3A @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on Sep 17, 2020 at 10:49pm PDT