సొసైటీ సైకోలా మారింది…ఆ సీన్ పై రాధిక ఫైర్…!


సోసైటి పై ఒక రేంజ్లో బరస్ట్ అయింది బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధిక ఆప్టే. ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ అనే హాలీవుడ్‌ సినిమాలో రాధికా ఆప్టే నటిస్తుంది. అయితే ఆ సినిమాకు సంభందించిన ఓ సన్నివేశం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ వ్యవహారంపై రాధిక ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాజం ఓ సైకో అంటూ ఫైర్‌ అయ్యారు. ఆ లీకైన సీన్‌లో తనతో పాటు దేవ్‌పటేల్‌ కూడా ఉన్నారని, కానీ కేవలం రాధికా ఆప్టే సెక్స్ సీన్ అనే ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో చాలా అద్భుతమైన స‌న్నివేశాలు ఉన్నాయని, కానీ అవ‌న్నీ వ‌దిలేసి కేవ‌లం ఈ ఒక్క సెక్స్ సీన్ మాత్ర‌మే లీక్ చేసారన్నారు.

ఈ తరహా సన్నివేశాల్లో నటించడానికి తనకేం ఇబ్బందిలేదంటూ గతంలోనే హాట్ కామెంట్స్ చేశారు రాధిక. 2016, ఆగస్టులో అదిల్‌ హుస్సెన్‌తో సాన్నిహిత్యంగా ఉన్న సన్నివేశాలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి. ‘ బోల్డ్‌ సీన్స్‌లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ప్రపంచ సినిమాలు చూస్తూనే పెరిగాను.. నా శరీరంతో నేను సౌకర్యంగానే ఉన్నాను. భారత్‌, ఇతర దేశాల్లో న్యూడ్‌గా నటించడం నేను చూశాను. బోల్డ్‌ సీన్స్‌లో నా శరీరాన్ని చూసుకొని నేనేం సిగ్గుపడటం లేదు. అవమానంగా ఫీలవ్వడం లేదు. అది ఒక వస్తువులాంటిదే. దాన్ని నేను నా నటనకు ఉపయోగిస్తున్నాను.’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ది వెడ్డింగ్‌ చిత్రాన్ని మైఖెల్‌ వింటర్‌ బాటమ్‌ తెరకెక్కిస్తుండగా.. జిమ్ సర్బ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.