ఆర్ఆర్ఆర్ ఎలా ఉండబోతుందో మొదటి సారి క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..

బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి..ప్రస్తుతం ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర ఓపెనింగ్ గ్రాండ్ గా జరిపిన రాజమౌళి..ఈ సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్స్ తెలియజేయకుండా అందరిలో ఆసక్తి పెంచుతున్నాడు.

ప్రస్తుతం రెండో షెడ్యూల్ పూర్తి కావడానికి వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు..షూటింగ్ అప్డేట్ ఏంటి..అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఏది తెలియజేయడం లేదు. దీంతో మీడియా లో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో స్వయంగా రాజమౌళి తెలిపి మరోసారి సినిమా ఫై ఆసక్తి పెంచాడు.

తాజాగా రాజమౌళి హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ 2019లో పాల్గొన్నాడు. అక్కడ రాజమౌళి ని మీడియా వారు ఆర్ఆర్ఆర్ గురించి అడుగగా..ఈ చిత్రం బాహుబలి మాదిరిగానే ఇండియా మొత్తం చూడదగిన సినిమాగా ఉండబోతుందని తెలిపాడు. ఆయన మాటల్ని బట్టి తెలుగు పరిశ్రమ నుండి త్వరలో మరో అద్భుతం చూడబోతున్నామని అర్ధం అవుతుంది. ఇంత భారీ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నాడు. 2020 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.