రాజమౌళి సెంటిమెంట్ ను తిరగరాయాలని చూస్తున్న ఎన్టీఆర్..?

దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేస్తే ఆ తర్వాత సదరు హీరోలు వరుస ప్లాప్స్ చూడాల్సిందే అని అంత అంటుంటారు. ఇప్పటి వరకు అలాగే జరిగాయి. అయితే ఈ సెంటిమెంట్ ను తిరగరాయాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తికాగానే కొరటాల తో గాని త్రివిక్రమ్ తో కానీ సినిమా చేయాలనీ ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరు డైరెక్టర్లతో ఎన్టీఆర్ వర్క్ చేసి హిట్స్ కొట్టాడు. అందుకే ఇప్పుడు మరోసారి వారితో పనిచేసి మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడట. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే ఈ మూవీ లో ఎన్టీఆర్ కొమరం భీం, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించబోతున్నారు.