రెండు బయోపిక్.. ఒకే సినిమా .. రాజమౌళి కేక

దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కథ వెల్లడించేసారు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కథల్లోని ఓ కామన్ పాయింట్ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నట్లు ఆయన తెలిపారు ”1897లో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. మూడు సంవత్సరాలు పాటు ఇంటిపట్టున లేరు. తిరిగొచ్చాక ఆయన ఫ్రీ డమ్ మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం మనకు తెలిసిందే.

1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమురం భీం పుట్టారు. ఆయనకు కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. తిరిగొచ్చాక నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల కోసం పోరాడారు. అల్లూరిలాగే కొమురం భీం పోరాడారు. వాళ్ల చరిత్ర నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అదే మేం సినిమాలో చూపించబోతున్నాం” అని కధని చెప్పారు రాజమౌళి.

మొత్తానికి రెండు బయోపిక్స్ ని ఒకే సినిమాతో తీసి తనకే సాధ్యమైన క్రియేటివిటీని చూపించబోతున్నారు రాజమౌళి.