రజనీతో రౌడీ పోటి? కరెక్టేనా ?

అర్జున్ రెడ్డి తో విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ ఎంతటిదో వేరే చెప్పక్కరలేదు , ఈ సినిమాకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందొ విడుదల అయిన ప్రతీ లాంగ్వెజ్ లోనూ విజయ డంఖా మ్రోగించింది ,కలెక్షన్ల వర్షం కురిపించింది . ఈ సినిమా పుణ్యమా అని ఇంతవరకూ హిందీ ఫిలిమ్స్ లో నటించకపోయినా విజయ్ కి బాలీవుడ్ లో కూడా ఒక ఫాలోయింగ్ ఏర్పడిపోయింది . సెన్సేషనల్ స్టార్ అయిపోయిన ఈ రౌడీ హీరో కి ఓ క్రేజీ బాలీవుడ్ ఆఫర్ వచ్చిందన్న టాక్ ఈ మధ్య బాగా వినిపిస్తోంది.ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ విజయ్ తో ఒక సినిమా కోసం చర్చలు జరుపుతుందని సమాచారం.కరణ్ జోహార్ వంటి బడా ప్రొడ్యూసర్స్ రౌడీ హీరో పై ఫోకస్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో యష్ రాజ్ ఫిలిమ్స్ విజయ్ తో సినిమా చేస్తుందంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమి లేదు. కాకుంటే ఈ సినిమాకి విజయ్ దేవరకొండకి యష్ రాజ్ ఫిలిమ్స్ రూ. 48 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి విజయ్ లాంటి మిడ్ రేంజ్ హీరోకి ఇంత పారితోషికం అంటే చాలా ఎక్కువ. నిజానికి ఇండియన్ సినిమా హీరోలలో ఒక్క రజనీ కాంత్ మాత్రమే ప్రస్తుతం రూ.50 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ఇక బీ-టౌన్ స్టార్స్ గా చెలామణి అవుతున్న ఖాన్ లు, కపూర్ లు, సింగ్ లు ఎవ్వరూ కూడా ఈ మ్యాగ్జిమమ్ ఫిగర్ కి దరిదాపుల్లో లేరు. మరి ప్రముఖ నిర్మాణ సంస్థ వారెవ్వరికీ ఇవ్వని రెమ్యునరేషన్ బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయని విజయ్ దేవరకొండకి ఎందుకు ఇస్తుందన్నదే అసలు ప్రశ్న? అందుకే ఈ వార్తలో నిజమెంతన్న విషయంలో చర్చ జోరుగా సాగుతోంది.