దళపతి తర్వాత మళ్ళీ

సూపర్ స్టార్ రజనీ కాంత్, ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెల్సీన్దె . ఈ విషయాన్ని స్వయంగా మురగదాస్ చెప్పారు. ”చాలా రోజుల కిందటే స్క్రిప్ట్‌ను రజనీ సర్‌కు వినిపించా. ఆయనకూ నచ్చింది.” అని చెప్పారు మురగ. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా కెమరామెన్ ఫిక్స్ అయ్యారు సంతోష్ శివన్ ని ఫిక్స్ చేశారు.

రజనీకాంత్ నటించిన ‘దళపతి’ చిత్రానికి ఆయన పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ రజనీకాంత్ చిత్రానికి కలసి పనిచేసే అవకాశం ఆయనకు రాలేదు. ఇన్నేళ్లకు మళ్లీ వీరిద్దరూ కలుస్తున్నారు. ఈ విషయాన్ని సంతోష్ ట్వీట్ చేస్తూ, ‘దళపతి తర్వాత మళ్లీ ఇప్పుడు రజనీ సార్ తో కలసి పనిచేస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్ గా వుంది’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.