ప్రముఖ నిర్మాత రాజ్‌కుమార్‌ కన్నుమూత..

‘‘హమ్ ఆప్‌కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, ప్రేమ్ రతన్ ధన్ పాయో, మైనే ప్యార్ కియా’’ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు (గురువారం) ఉదయం ముంబైలోని రిలయన్స్ హర్కిసెండాస్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

దర్శక నిర్మాత సూరజ్ ఆర్ బర్జాత్య ఈయన కుమారుడే. ఈయన దర్శకత్వంలోనే వచ్చిన ‘‘మైనే ప్యార్ కియా’’ తో సల్మాన్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో సల్మాన్..ప్రేమ్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఇదే సినిమాను తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా డబ్ చేస్తే ఇక్కడ కూడా ఓ రేంజ్‌లో హిట్టైయింది. ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని తమ సంతాపాన్ని తెలియజేస్తుంది.