శ్రీదేవి పాత్ర లో రకుల్ ఎలా అదరగొడుతుందో..

యావత్ సినీ ప్రేక్షకులంతా బయోపిక్ లపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు లో విడుదలైన మహానటి , హిందీ లో విడుదలైన సంజు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి మరికొన్ని బయోపిక్ లకు దారి తీశాయి. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే దాదాపు మూడు బయోపిక్ లు సెట్స్ ఫై ఉన్నాయి. అందులో నందమూరి తారకరామారావు జీవిత కథ తో తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ చిత్రం ఫై మాములు అంచనాలు లేవు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తూ , నిర్మించడం ఒకెత్తు అయితే ఈ సినిమాలో టాప్ బాలీవుడ్ , టాలీవుడ్ నటులు వివిధ పాత్రల్లో నటించడం మరో ఎత్తు. డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది.

తాజాగా ఈ మూవీ లో బసవతారకం రోల్ చేస్తున్న విద్యాబాలన్ సెట్స్ లో జాయిన్ కాగా , ఇక శ్రీదేవి పాత్ర లో కనిపించబోతున్న రకుల్ ప్రీతీ సింగ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు ఈ మూవీ లో రకుల్ ఓ ఐటెం సాంగ్ లో కనిపించబోతుందనే వార్తలు వినిపించాయి.. కానీ ప్రస్తుతం మాత్రం ఐటెం సాంగ్ కాదట శ్రీదేవి పాత్ర కు గాను ఈమెను ఎంపిక చేసారని తెలుస్తుంది. ఎన్టీఆర్ – శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినీ కెరియర్ లో శ్రీదేవి కూడా చాల ప్రధమం అందుకే ఆమె పాత్ర ను చూపించబోతున్నారట క్రిష్. అలాగే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది.

ఈ సినిమాను సాయి కొర్రపాటి, విష్ణు, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, నరేష్, సచిన్ కెడ్కర్ , రానా , సుమంత్ వంటి నటీనటులు నటిస్తున్నారు.