రకుల్ ఆ పనికి ఒప్పుకుంటుందా..?

ఇండస్ట్రీ లో ఎక్స్ ప్రెస్ స్పీడ్ తో దూసుకొచ్చిన రకుల్..ఆ తర్వాత అంతే స్పీడ్ గా తగ్గింది..కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. మరోపక్క ఈమె చేసిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అవుతుండడం , అమ్మడి గ్లామర్ కూడా తగ్గడం తో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీంతో నిర్మాతలు రకుల్ ను పక్కకు పెట్టడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చారు. అయితే అనుకోకుండా అమ్మడికి ఐటెం ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

నాని – విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్..ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రకుల్ ప్రీతీ సింగ్ ను అనుకుంటున్నారట. మరి ఈ ఆఫర్ కు రకుల్ ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు కూడా పెద్దగా లేవు కాబట్టి ఒప్పుకుంటుందని భావిస్తున్నారు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాని ఇదివరకటి సినిమాల్లో కంటే భిన్నంగా కనిపిస్తాడని తెలుస్తోంది.