‘మన్మథుడు 2’ లో రకుల్ మరీ హాట్ గురూ

 

చాలా కాలం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఓకే చేసిన తెలుగు సినిమా ‘మన్మథుడు 2’. ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ చేస్తున్న అవంతిక పాత్రకు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉన్నట్లు తెలుస్తోంది. గ్లామర్ కి గ్లామర్ వంటివి అన్నీ గిట్టుబాటు అయ్యేట్లుగా తెలుస్తోంది.  అందుకే ఆ పాత్ర కోసం రకుల్ చాలా కష్టపడ్డారని సమాచారం. నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా పూర్తి స్వేచ్ఛ తీసుకొని నటించినట్లు సమాచారం అందుతుంది.

కాగా ట్రైలర్, పోస్టర్లు చూస్తుంటేనే పొట్టి పొట్టి బట్టలతో అందాలను ఆరబోస్తూ హాట్‌గా కనిపించిన పూర్తి సినిమాలో ఇంకెంత హాట్ గా పిచ్చెక్కిస్తారని అభిమానులు ఆతృతగా ఎదరు చూస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే.. రకుల్ తన గ్లామర్ తో సినిమాకు మంచి క్రేజ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. కాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా  ఆగష్టు 9న రిలీజ్ కానుంది.