ఎన్టీఆర్ కు చేసిన తప్పే చరణ్ కు చేస్తున్నారా..?

ఎన్టీఆర్ కెరియర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం అరవింద సమేత. మొదటిసారి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రావడం , థమన్ మ్యూజిక్ ఆకట్టుకోవడం , హరికృష్ణ మరణం తర్వాత సినిమా రావడం తో ఎన్టీఆర్ అభిమానులే కాదు , యావత్ సినీ ప్రేమికులు సైతం ఈ సినిమాకు బ్రహ్మ రధం పట్టారు. సినిమా టాక్ కూడా బాగుండడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబట్టింది. కానీ బయ్యర్లకు మాత్రం పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేదు. దీనికి కారణం చిత్ర నిర్మాతలు ఎక్కువగా రేట్లకు సినిమా రైట్స్ అమ్మడమే. ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరగడం తో చివరికి వచ్చే వరకు నిర్మాతలకు భారీ లాభాలే వచ్చినప్పటికీ బయ్యర్లు మాత్రం నామ మాత్రపు లాభాలతో బయటపడ్డారు. ఒకవేళ నిర్మాతలు కాస్త తక్కువ రేట్లకు అమ్మితే మంచి లాభాలే వచ్చేవి.

ఇప్పుడు ఇదే పద్దతిలో రామ్ చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ విషయంలో నిర్మాతలు చేస్తున్నారట. బోయపాటి శ్రీను – చరణ్ కలయికలో మొదటిసారి సినిమా వస్తుండడం , అది కాక రంగస్ధలం చిత్రం తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కావడం తో ఈ చిత్ర రైట్స్ భారీగా కోడ్ చేస్తున్నారట. ఇలా చేయడం వల్ల లాభాలు రావడం లేదని బయ్యర్లు వాపోతున్నారట. అంతే కాదు ఇలా ఇష్టానుసారంగా అమ్మితే లాంగ్ రన్ లో అంత కలెక్షన్లు సాదించకపోవడం వల్ల హీరోల ఖాతాల్లో ప్లాపులు చేరుతాయని చెపుతున్నారట. బయ్యర్ల గుగ్గులు వినైనా కాస్త రేటు తగ్గిస్తే బాగుంటుందని అంత మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.