రకుల్ తో ఎంగేజ్‌మెంట్‌ ఫై రామ్ క్లారిటీ..

హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో రామ్ …ప్రస్తుతం నేను లోకల్ ఫేమ్ త్రినాధ్ నక్కిన డైరెక్షన్లో శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై దిల్ రాజు నిర్మిస్తున్న హలో గురు ప్రేమకోసమే అనే చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర డబ్బింగ్ పనుల్లో రామ్ బిజీ గా ఉన్నాడు. తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ప్రశ్నలకు సమాదానాలు తెలిపి ఆశ్చర్యపరిచాడు.

అందులో భాగంగా హీరోయిన్ రకుల్ తో ఎంగేజ్‌మెంట్‌ ఫై కూడా క్లారిటీ ఇచ్చాడు. రెండేళ్ల క్రితం హీరోయిన్ రకుల్ ను రామ్ పెళ్లిచేసుకుంటున్నాడని ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇదే ప్రశ్నను సదరు యాంకర్ అడుగగా.. ఎవరో ఒకరిద్దరు అనుకుని ఉంటారు. నా వరకూ రాలేదు. రకుల్‌తో నాకు ఎంగేజ్‌మెంట్‌ ఏంటి? మేమిద్దరం కలసి ‘పండగ చేస్కో’ ఒక్క సినిమానే చేశాం. మేం అంత క్లోజ్‌ కూడా కాదు. అలాంటి గాసిప్స్‌ ఎలా వస్తాయో కూడా అర్థం కాదు. నా మీద గాసిప్స్‌ ఏమన్నా వస్తే మా అన్నయ్య, స్నేహితులు చెబుతుంటారు. వాటిని అస్సలు పట్టించుకోను అని రామ్ క్లారిటీ ఇచ్చాడు.