రామ్ ‘పాపింగ్’ చూశారా ?

ఎనర్జిటిక్ హీరో రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా దర్శ‌కుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘హలో గురు ప్రేమకోసమే’.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలోని తొలి పాట ప్రోమోను రామ్‌ ట్విట్‌ వేదికగా విడుదల చేశారు. ‘అడిగారుగా.. ఈ కొత్త డ్యాన్స్‌ పేరు ‘పాపింగ్’. దక్షిణాది సినిమాలో ఇలాంటి డ్యాన్స్‌తో పాట రావడం ఇదే మొదటిసారి. నా తదుపరి చిత్రాల్లోనూ ఈ డ్యాన్స్‌ను కొనసాగిస్తాను. మీ అందరికీ సింపుల్‌ చిత్రాలు నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.’ అని వెల్లడిస్తూ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. దసరా సందర్భంగా శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.