మెగా హీరో మూవీ లో రమ్యకృష్ణ..

ఒక్కప్పుడు అగ్ర హీరోయిన్ గా అందరితో జోడి కట్టిన రమ్యకృష్ణ..ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ లలో నటిస్తూ అలరిస్తుంది. ఇక బాహుబలి చిత్రంలో శివగామి గా పవర్ ఫుల్ రోల్ లో నటించి యావత్ ప్రపంచానికి తన నటనను చూపించిన ఈమె..ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ మళ్లీ బిజీ అయ్యింది. తాజాగా ఈమెకు మెగా హీరో మూవీ లో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నది. అలానే బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి మరో కీలక పాత్ర చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది.