రానా ‘ దూల ‘ తీర్చిన క్రిష్..

బాలకృష్ణ – క్రిష్ కలయికలో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ మరో నాల్గు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ మూవీ ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. చిత్ర యూనిట్ సైతం వివిధ రకాలుగా ప్రమోషన్లు చేస్తూ సినిమా ఫై ఇంకాస్త క్రేజ్ తెస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రానా మాట్లాడుతూ..నా దూల తీర్చారని చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది.

‘ఎన్టీఆర్’ చిత్రంలో రానా నారా చంద్రబాబు నాయుడు పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. ‘ఎన్టీఆర్’ రెండు పార్ట్ లలో కూడా రానా పాత్ర చాలా కీలకం కాబోతుంది. ఈ పాత్ర పోషించడం పట్ల రానా స్పందిస్తూ… మీ అందరికి మంచి పాత్రలు వచ్చాయి మీ అందరికి బాగానే ఉంది మీరు మీ తండ్రులు తాతల పాత్రలను చేసి బాగానే ఉన్నారు. కాని నాకు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇవ్వడంతో దూల తీరిపోయింది అంటూ నవ్వుతూ సరదా కామెంట్ చేశాడు.

నాకు క్రిష్ ఈ పాత్ర గురించి చెప్పగానే ఎన్టీఆర్ గారిపై ఉన్న అభిమానంతో కాదనలేక పోయాను. ఈ చిత్రం కోసం చాలా హోం వర్క్ చేయాల్సి వచ్చింది. చంద్రబాబు గారి ముందు తీసుకు వెళ్లి కూర్చోబెట్టారు. ఆయన చాలా విషయాలు చెప్పారు. ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ వల్ల ఈ పాత్ర చేయడం నాకు ఈజీ అయ్యిందని ఇంటర్వ్యూ లో తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.