మహానాయకుడు ‘చంద్రబాబు’ ను వాడుకుంటున్నాడు..

ఎన్టీఆర్ జీవిత కథ తో ఎన్టీఆర్ బయోపిక్ అనగానే చిన్న , పెద్ద , సినీ , సామాన్య ఇలా అందరూ ఇంట్రస్ట్ చూపించారు. మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గరి నుండి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసారు. మొదటి రోజు మొదటి షో చూసారు..ఆలా చూసి బయటకు రాగానే ఛీ ఇదో సినేమానా..అని అన్నారు. అంతే సాయంత్రం కల్లా డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా చేరిపోయింది. మొదటి పార్ట్ ఎఫెక్ట్ రెండో పార్ట్ ఫై ఘోరంగా పడింది. మరో రెండు రోజుల్లో సినిమా వస్తుంది. అయినాగానీ ఎక్కడ ఆ హడావిడే లేదు. బుకింగ్స్ ఓపెన్ అయినాగానీ ఇంతవరకు 25 శాతం టికెట్స్ తెగలేదట.

దీంతో చిత్ర యూనిట్ చంద్రబాబు ను రంగంలోకి దింపారు. అంతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను కాదు..ఈ సినిమాలో చంద్రబాబు గా కనిపిస్తున్న రానా బాబు ను. చంద్రబాబు పాత్ర కోసం రానా ఎంత కష్టపడ్డాడో.. చంద్రబాబు ఆహార్యంలో కనిపించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో అన్ని వీడియో రూపంలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో విడుదల చేసారు. చిత్ర యూనిట్ ఎన్ని చేసిన కానీ సినిమాకు రావాల్సిన క్రేజ్ మాత్రం రావడం లేదు. మరి సినిమా పరిస్థితి ఏంటి అనేది రెండు రోజుల్లో తేలనుంది.