తమిళ్ లోకి కూడా జెర్సీ….రానా ప్రొడ్యూసర్….విశాల్ హీరో !

ప్రస్తుతం అన్ని బాషలలో రీమేక్స్ సీజన్ నడుస్తోంది. ఇతర బాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలని తమ బాషలలోకి రీమేక్ చేసి సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు కొందరు. అలా రీమేక్ అయిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి కూడా, తాజాగా ఆలా రీమేక్ అయి కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా.

తాజాగా ఇప్పుడు మరో రీమేక్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నీమధ్యన నాని హీరోగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన జెర్సీ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా ఆ సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అయితే ఆ సినిమాకి ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి కానీ వసూళ్ల పరంగా పెద్దగా హిట్ కాలేదు.

ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా తమిళ రీమేక్‌ కూడా తెరపైకి వచ్చింది. ‘జెర్సీ’ తమిళ రీమేక్‌ రైట్స్‌ను హీరో రానా దక్కించుకున్నారని ప్రచారం మొదలయ్యింది. ఇందులో రానా నటించబోవడం లేదట కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారట. విష్ణు విశాల్‌ తమిళ ‘జెర్సీ’ హీరోగా నటించనున్నారని అంటున్నారు.

రానా హీరోగా నటిస్తున్న ‘కాడన్‌’ (తెలుగులో ‘అరణ్య’) సినిమాలో విష్ణు విశాల్‌ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్‌పై విష్ణు విశాల్‌కు మంచి అవగాహన ఉందని తెలుస్కున్న రానా ఈ హక్కులు కొని ఈయన్నే పెట్టి తీయాలని ఫిక్స్ అయ్యాడట. ఇందులో నిజం ఎంతుందో అధికారిక ప్రకటన వస్తే కానీ తేలీదు.