తనీష్ కు ‘రంగు’ పడింది..

బాలనటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న తనీష్..హీరోగా మాత్రం రాణించలేకపోతున్నాడు. కనీసం యావరేజ్ లు కూడా పడకపోవడం తో విలన్ గా కూడా మారాడు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన నక్షత్రం లో మూవీ లో విలన్ గా నటించాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడం తో మరో అవకాశం రాకుండా పోయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 2 లో అవకాశం రావడం తో ఈయన జాతకం మారిపోయినట్లే అనుకున్నారంతా..కానీ ఆయన జాతకం ఏమాత్రం మారలేదని రంగు సినిమాతో బయటపడింది.

తనీష్ హీరోగా నటించిన ‘రంగు’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం ప్రారంభించి చాలా కాలం అయ్యింది. తనీష్ కెరీర్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కారణంగా సినిమా విడుదలకు ఇబ్బందులు తలెత్తినట్లుగా వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని ఫైనల్స్ వరకు తనీష్ వెళ్లడం తో తనీష్ కు క్రేజ్ దక్కిందని – ఆ క్రేజ్ తో రంగు ను విడుదల చేసి మంచి కలెక్షన్స్ దక్కించుకోవాలని నిర్మాతలు భావించారు. ‘రంగు’ సినిమాకు మంచి పబ్లిసిటీ చేయడంతో పాటు – అందరిలో ఆసక్తి కలిగించేలా టీజర్ – ట్రైలర్ ను కూడా కట్ చేశారు. కానీ సినిమా ఏమాత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది.

సినిమా కాస్త బాగానే ఉందని రివ్యూస్ వచ్చిన కానీ , సినిమాను చూసే వారే కరువయ్యారు. మొదటి రోజే ఇలా ఉంటె వీకెండ్ తరువాత పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. కనీసం సినిమాకు పెట్టిన పెట్టుబడిన వస్తుందని ఆశ పడ్డారు కానీ వసూళ్లు చూస్తే నష్టాలే తప్ప పెట్టినపెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అర్ధం అవుతుంది. మొత్తం మీద తనీష్ రంగు పడినట్లే అని అంత మాట్లాడుకుంటున్నారు.