రవితేజ కు జోడిగా మళ్లీ ఆ భామే..

గత కొంతకాలం గా హిట్ లేని రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్లో ఓ మూవీ , నేను లోకల్ ఫేమ్ నక్కిన త్రినాధ్ డైరెక్షన్లో ఓ మూవీ ప్రకటించారు.

రమేష్ వర్మ సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాలో రవితేజ డబల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అందుకే ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం , మరో హీరోయిన్ గా రాశి కన్నాను తీసుకోనున్నారని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. తమిళంలో అరవింద స్వామి, త్రిష కలయికలో రానున్న ‘శతురంగ వెట్టై 2’ చిత్రాన్నే తెలుగులో రవితేజ చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అన్నట్టు ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు.