ఘనంగా రేణు దేశాయ్ ఎంగేజ్‌ మెంట్‌..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్ ఒంటారిగా ఉంటూ తన పిల్లల్ని చూసుకుంటున్న సంగతి తెల్సిందే. పవన్ కళ్యాణ్ మాత్రం మూడో పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉన్నాడు. ఈ నేపథ్యం లో నేను మాత్రం ఎందుకు ఒంటరిగా ఉండాలని అనుకుందో ఏమో కొంతకాలంగా తనకు కరెక్ట్ గా సరిపోయే భాగస్వామి కోసం వెతుకుతుంది. తాజాగా తన మనసుకు నచ్చిన వాడిని ఎంచుకొని రెండో పెళ్లికి సిద్ధం అయ్యినట్లు తెలిపింది.

తాజాగా ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ చెయ్యేసిన ఫొటోలో నిశ్చితార్థపు ఉంగరాలు గమనించవచ్చు. జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత ఇ‍వ్వకపోయినా.. ఎంగేజ్‌ మెంట్‌ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్‌తో తెలిపింది.

అంతకు ముందు ఇటీవల తనకు ఓ తోడు దొరికినట్లు, ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను అభిమానులకు షేర్ చేసి , రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పింది. ఆ తర్వాత తన పిల్లలు, స్నేహితులతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న నేపథ్యం లో తనకు కాబోయే భర్త మెసేజ్ లు పంపిస్తున్నారట. అయితే వాటిని చూసుకోకుండా తన స్నేహితులు అడ్డు పడుతున్నారని , తనకు ప్రైవసీని ఇవ్వడం లేదంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. ప్రస్తుతం తన కుమారుడు అకిరా మాత్రం పవన్ తో కలిసి ఉన్నాడు. సెలవుల నేపథ్యం లో అకిరా పవన్ దగ్గర ఉన్నట్లు రేణు తెలిపింది. మరి ఎంగేజ్‌ మెంట్‌ సమయం లో అకిరా రేణు దగ్గర లేడని తెలుస్తుంది.