ఆర్ఆర్ఆర్ 10 భాషల్లో రిలీజ్..మరి చెప్పిన టైంకు వస్తుందా..?

దర్శక ధీరుడు రాజమౌళి గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ ఫై వస్తున్న రూమర్లకు ఒకే ఒక దెబ్బతో చెక్ పెట్టాడు. చిత్రంలో ఎన్టీఆర్ జోడి ఎవరు..సినిమాలో విలన్ రోల్ లో ఎవరు చేస్తున్నారనే విషయాలను తెలిపి అందరిలో ఆనందం నింపారు. అలాగే ఈ సినిమాను 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుపడం అందరికి షాక్ ఇస్తుంది. పది భాషల్లో అంటే కష్టమే కాదు కదా చెప్పిన టైంకు తీసుకరావడం అని అంత మాట్లాడుకుంటున్నారు. ఇది సాధ్యమా అవుతుందా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి రాజమౌళి అది ఎలా సాధ్యం చేస్తాడో చూడాలి. ఇక విలన్..ఎన్టీఆర్ జోడి చూస్తే..

సినిమాలో ఎన్టీఆర్ ఒక బ్రిటిష్ అమ్మాయితో ప్రేమలో పడతారు. అందుకని ఈ పాత్ర కోసం లండన్‌కు చెందిన ఒలివియా మోరిస్‌ను చేశారు. ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్ పండించడంలో ఒలివియా దిట్ట అందుకే ఈమెను జక్కన్న ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.చిత్ర యూనిట్ విడుదల చేసిన ఒలివియా ఫొటోను చూసి అంతా భలే ఉందే అంటూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. ఇక ఈ మూవీ లో ఈమె పాత్ర పేరు జెన్నీఫర్. ఇక ఈ మూవీ లో విలన్ గాఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌సన్‌ను ఎంపిక చేసారు. థియేటర్ ఆర్టిస్టు స్థాయి నుంచి హాలీవుడ్ నటుడుగా ఎదిగారు. 20కి పైగా హాలీవుడ్ చిత్రాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మరో విలన్ గా లేడీ స్కాట్ లో ఐరిష్ నటి అలిసన్ డూడీ నటిస్తున్నారు. మొత్తం మీద ప్రేక్షకుల ఆసక్తి తగ్గట్లే అప్ డేట్స్ ఇచ్చి సినిమాపై మరింత అంచనాలు పెంచారు.