ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ఇక జీతాలు ఇవ్వరా..?

కరోనా వైరస్ అనేక సంస్థలను ఆర్ధికంగా ఇబ్బందికి గురి చేసాయి. వాటికీ చిత్రసీమ కూడా ఉంది. సినిమా షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్స్ బంద్ కావడం తో చిత్రసీమనే నమ్ముకున్న వారు రోడ్డున పడ్డారు. ఇక లాక్ డౌన్ సమయంలో చాల సంస్థలు తమ ఉద్యోగులకు సగం జీతాలే ఇస్తున్న సంగతి తెల్సిందే. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సైతం తమ యూనిట్ సబ్యులకు సగం జీతాలే ఇస్తున్నారట.

అయితే ఈనెలలో మాత్రం ఇక జీతాలు ఇవ్వమని, మళ్లీ షూటింగ్ లు ప్రారంభం అయ్యాకే ఇస్తామని చెప్పేసారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇది యూనిట్ అంతటికీనా? కాదా? అన్న సంగతి తెలియకదు కానీ, యూనిట్ లోని ఓ కీలక డిపార్ట్ మెంట్ లో మాత్రం టీమ్ మొత్తానికి మళ్లీ షూటింగ్ మొదలయ్యే వరకు జీతాలు వుండవని చెప్పినట్లు తెలుస్తోంది.