ఆర్ఆర్ఆర్ టీం క్లారిటీ ఇచ్చింది..ఇక పండగ చేసుకోవచ్చు..

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. పీరియాడిక్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు ఉద్యమ వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబందించిన నటి నటుల వివరాలు తప్ప చిత్ర లోగో కానీ హీరోల తాలూకా ఫస్ట్ లుక్ గాని విడుదల చేయకపోయేసరికి అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని దేశ వ్యాప్తంగా అంత ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరం సంధర్భంగా పోస్టర్స్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోట్లేదు అభిమానులు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విట్టర్ వేదికగా 2020కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చేద్ధాం.. మేము దానిపై పని చేస్తున్నాము అంటూ పోస్ట్ చేసింది. టీమ్ క్లారిటీ ఇవ్వడం తో అభిమానులు పండగ చేసుకోవచ్చు.