జనవరి ఒకటికి ఆర్ఆర్ఆర్ టైటిల్


రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. రామ్ చర‌ణ్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జ‌రుగుతోంది. అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌లో ఉన్న రామ్ చ‌ర‌ణ్‌తో పాటు వంద‌లాది మంది జానియ‌ర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

షూటింగ్‌లో 60 శాతం అక్కడే జ‌ర‌గ‌నుంది. మంగ‌ళ‌, బుధ వారాల్లో ఫిల్మ్‌సిటీలోనే స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. జనవరి ఒకటిన ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారని తెలిసింది. ఇందులో అలియా భట్ హీరోయిన్. ఇంకొ హీరోయిన్ ఎంపిక జరగాల్సివుంది. ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్