రవితేజ #66 మూవీ ముహూర్తం పిక్స్..

మాస్ మహారాజా తన 66 వ చిత్రానికి ముహూర్తం పిక్స్ చేసాడు. నవంబర్ 14 న ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు జరగబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. డాన్ శ్రీను , బలుపు చిత్రాల డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. పోస్టర్ లో తుపాకి పట్టుకుని బయలుదేరినట్లు సీరియస్ గా రవితేజ కనిపించాడు. మరి ఇలా తుపాకితో ఏం చేయబోతున్నాడో మరి. ఇక ప్రస్తుతం మాత్రం డిస్కో రాజా చిత్రం చేస్తున్నాడు. వి ఐ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.