ఏడో రోజు కూడా ‘ RX ‘ కలెక్షన్ల స్పీడ్ తగ్గలేదు..

గత ఏడాది అర్జున్ రెడ్డి ఎలాంటి కలెక్షన్ల సునామి సృష్టించిందో..ఇప్పుడు RX 100 కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. యూత్ కావాల్సిన ప్రేమ , మసాలా సన్నివేశాలు నిండుగా ఉండడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ తో RX తన స్పీడ్ ను కొనసాగిస్తుంది. మొదటి వారంలో ఈ సినిమా మొత్తంగా రూ.7.53 కోట్లు(షేర్) వసూలు చేసి…నిర్మాతలకు – డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. అన్ని ఖర్చులు కలుపుకొని 2.5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం….థియాట్రికల్ రన్ లో 10 కోట్లకు మించి వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.

ఇక ఏడోవ రోజు షేర్ చూస్తే..

నైజాం——-> 33.66 లక్షలు
సీడెడ్ ——-> 7.62 లక్షలు
వైజాగ్ ——-> 6.43 లక్షలు
ఈస్ట్ ——-> 3.71 లక్షలు
వెస్ట్ ——-> 3.90 లక్షలు
కృష్ణా ——-> 3.61 లక్షలు
గుంటూర్ ——-> 3.48 లక్షలు
నెల్లూర్ ——->1.73 లక్షలు.

7వ రోజు మొత్తం షేర్ – 64.14 లక్షలు

మొత్తం మొదటి వారం షేర్ – 7.53 కోట్లు