అక్కడ హిట్.. ఇక్కడ ఫట్

యంగ్‌రెబల్‌ స్టార్‌ నటించిన ‘సాహో’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇటీవలె విడుదలయింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటించిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు నుండి అంచనాలు తారా స్థాయిలో ఉన్న  ‘సాహో’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. తెలుగులో ‘సాహో’ ఘోర పరాజయం పాలయిందని చెప్పవచ్చు. అయితే హిందీలో మాత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ ప్రేక్షకులకు ‘సాహో’ బాగా నచ్చిందట. ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్‌కు దక్కిన గుర్తింపు ఈ చిత్రంతో దృఢ పడిందని బాలీవుడ్‌ విశ్లేషకులు అంటున్నారు.

తాజాగా హిందీలో ‘సాహో’ రికార్డును దక్కించుకుంది. నేటితో ‘సాహో’ 150′ కోట్ల మార్క్‌ను సొంతం చేసుకుంది. హిందీలో మంచి టాక్‌ రావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. కానీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలం అయ్యింది. తెలుగులో 120 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిన ‘సాహో’ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చింది. లాంగ్‌ రన్‌లో కూడా 90కోట్లను కూడా వసూలు చేయడం కష్టమే అని ట్రేడ్‌ వర్గాల వారంటున్నారు.