సాహో నుండి మరో టీజర్ వచ్చిందోచ్…

ప్రభాస్ నటించిన సాహో చిత్రాన్ని చూడాలి..చూడాలి అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వేళా వారి కోసం ప్రభాస్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఇప్పటికే ట్రైలర్ యూట్యూబ్ లో సంచలన వ్యూస్ తో దూసుకెళ్తుంటే..సాహో సినిమాకు సంబంధించి వీడియో గేమ్ టీజర్ ను విడుదల చేసారు. ఆ మధ్య సాహో గేమ్ రాబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే . దీనికి సంబంధించి ఈరోజు సాహు వీడియో గేమ్ టీజర్ ను ప్రభాస్ లాంచ్ చేశారు. ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ పేజీలో ఈ ట్రైలర్ ను పోస్ట్ చేశారు. యాక్షన్ జానర్లో రూపొందించిన ఈ టీజర్లో ప్రభాస్ లీడ్ రోల్లో కనిపిస్తారు.

Also Read :   పాయల్ అందరిలా కాదట..

సుజిత్ డైరెక్షన్లో యువి క్రియేషన్స్ బ్యానర్ లో దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ క్రేజీ నటీనటులు ఈ చిత్రంలో నటించారు .

Comments

Tagged: , , ,