మనకు నచ్చలే..వారికీ బాగా నచ్చింది..

బాహుబలి తర్వాత అంత భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సాహో. తెలుగు, తమిళ్ , హిందీ , మలయాళం ఇలా అన్ని భాషల్లో విడుదలైన ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ వచ్చింది. అభిమానులు , విమర్శకులు ఇలా అంత సినిమా ప్లాప్ అని తేల్చేసారు. తెలుగు , తమిళ్ , మలయాళం లో చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు భారీ నష్టాలూ బారినపడితే..హిందీ వెర్షన్ లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

అక్కడి ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మ రధం పడుతున్నారు. బాలీవుడ్ బాక్సాపీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రెండు వారాలకు గాను సాహో దాదాపు 140 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. బీహార్, గుజరాత్, యూపీ రాష్ట్రాలలో సాహో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఈ లెక్క చూసి నిర్మాతలు షాక్ అవుతున్నారు. మన ఆడియన్స్ నచ్చలే ని అక్కడి ప్రేక్షకులకు సాహో బాగా నచ్చిందని అంటున్నారు.