‘సభకు నమస్కారం’ చేయబోతున్న నాని…

గత ఏడాది నేను లోకల్ , ఏంసిఏ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నాని – దిల్ రాజు లు మరోసారి కలిసి ఓ సినిమా చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నాని శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం లో నాగార్జున తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇది అతి త్వరలో పూర్తి అవుతుందని సమాచారం. ఇది పూర్తి కాగానే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ‘జెర్సీ’ అనే సినిమా చేయబోతాడు. దీని తర్వాత నాని , దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయబోతాడట.

మొదటిసారి నాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చేయబోతున్నట్లు వినికిడి. ఇప్పటికే దీనికి టైటిల్ ఫిక్స్ చేసాడట దిల్ రాజు. ‘సభకు నమస్కారం’ అనే టైటిల్ ను ఫిక్స్ అయ్యాడని సమాచారం. ఇటీవల పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు నమోదు కావడం తో దిల్ రాజు ఈసడి పొలిటికల్ ఫై మనసు పారేసుకున్నాడని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు, నటి నటులెవరనే విషయాలు త్వరలో రాజు గారు ప్రకటిస్తారట. ప్రస్తుతం రాజు శ్రీనివాస కళ్యాణం చిత్రం తో ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నితిన్ – రాశిఖన్నా లు ఈ మూవీ లో హీరో హీరోయిన్లు గా నటించారు.