కేజీఎఫ్ తో వస్తే కథానాయకుడి తో పోయాయి..

డిస్ట్రబ్యూటర్ గా సినీ కెరియర్ మొదలు పెట్టిన సాయి కొర్రపాటి..ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ హిట్, ప్లాప్ లను అందుకుంటూ వస్తున్నారు. ఈయన నిర్మాణంలో ఎక్కువగా ప్లాపులే వచ్చిన నష్టాలను తెచ్చాయి. రీసెంట్ గా కన్నడ ఫిలిం కెజిఎఫ్ తెలుగులో విడుదల చేసి భారీ లాభాలే అందుకొని మొదటి సక్సెస్ ను ఎంజాయ్ చేసాడు. కానీ ఈ సంతోషం ఎక్కువగా రోజులు లేకుండా చేసాడు కథానాయకుడు.

బాలకృష్ణ – క్రిష్ కలయికలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి సహా నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ గా వహించిన సాయికొర్రపాటికి భారీ నష్టాలే వచ్చినట్లు తెలుస్తుంది. వైజాగ్, సీడెడ్, కృష్ణ, కర్ణాటకలో ఈ చిత్రాన్ని సాయి రిలీజ్ చేశారు. కానీ సినిమా మాత్రం మొదటి రోజే నెగిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో చాలామంది డిస్ట్రబ్యూటర్స్ కు నష్టాలే మిగిలాయి. మొత్తం మీద సాయికొర్రపాటి ఆనందం లేకుండా పోయింది.