ఆకాశమే నీ హద్దురా చూసి సామ్ ఏమన్నదో తెలుసా..?

గత కొంతకాలం గా వరుస ప్లాప్స్ ఎదురుకుంటున్న తమిళ్ హీరో సూర్య ఆకాశమే నీ హద్దురా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 12 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు దీని పట్ల స్పందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాపై సమంత ఆసక్తికర ట్వీట్‌ చేసింది. ఈ సినిమా యూనిట్‌ పై ప్రశంసల వర్షం కురిపించింది సమంత. ” ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌. ఈ సినిమా ఓ ఆణిముత్యం. సుధా కొంగర డైరెక్షన్‌ అమేజింగ్. సూర్య, అపర్ణ యాక్టింగ్‌ అద్భుతం. నాకు అవసరమైన ప్రేరణ, స్ఫూర్తి ఈ సినిమాలో ఉన్నాయి” అని సమంత ట్వీట్‌ చేసింది.