సంజు ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే వీడియో..

సంజయ్‌ దత్‌ జీవితగాథ ఆధారంగా హిరానీ తెరకెక్కించిన చిత్రం సంజు. సంజయ్ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటించగా, పరేష్‌ రావెల్‌, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్‌ తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. రెండేళ్ల తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు రూ. 500 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డ్స్ కు తెర తీసింది.

ఈ చిత్రం లో సంజయ్ డ్రగ్స్ కి అలవాటు పడటం, 1993 బాంబ్ బ్లాస్ట్ జ‌రిగిన స‌మ‌యంలో అక్ర‌మ‌ ఆయుధాలని క‌లిగి ఉన్న కార‌ణంగా జైలు శిక్ష అనుభవించడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, మూవీల్లో సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొట్టడం.. ఇలా అన్ని కోణాలని చూపించారు. ప్రతీ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రణ్ బీర్. చిత్ర నిడివి ఎక్కువైన కార‌ణంగా డిలీట్ చేసిన బోపు బాజ్ ర‌హా హై సాంగ్ ను తాజాగా చిత్ర యూనిట్వి యూట్యూబ్ లో విడుదల చేసారు. ఓ ఈవెంట్‌లో ర‌ణ్‌బీర్, విక్కీ కౌశ‌ల్‌, క‌రీష్మా తన్నాలు చేసిన సంద‌డి సాంగ్‌లో చూపించారు. ఈ సాంగ్ ఫై మీరు కూడా లుక్ వెయ్యండి.