సరిలేరు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..

సూపర్ స్టార్ మహేష్ బాబు – రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మూవీ సరిలేరు నీకెవ్వరు. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయినా ఈ మూవీ ఫస్ట్ డే నుండి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ వస్తుంది.

ఇక ఫస్ట్ వీక్ కు గాను బాక్సాఫీస్ కా బాప్.. అంటూ 100 కోట్లు షేర్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో అనీల్ సుంకర నిర్మించారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకపాత్ర పోషించి టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చారు.