దీపావళి కి సరిలేరు నుండి ఎవరి ఫస్ట్ లుక్ వస్తుందో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో రష్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం..దీపావళి కానుకగా ఈ మూవీ నుండి అదిరిపోయే గిఫ్ట్ రాబోతుంది.

ఈ మూవీ తో సీనియర్ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ మూవీ లో నటిస్తుండడం తో ఆమె ఎలా కనిపించబోతుందా అనే ఆత్రుత అందరిలో నెలకొని ఉంది. అందుకే వారి ఆతృతను తెరదించబోతున్నారు చిత్ర యూనిట్. దీపావళి కానుకగా ఈమె తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, రష్మిక మందాన మొదటి సారి మహేష్ తో జత కట్టింది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.