రికార్డు వ్యూస్ వైపు సర్కార్ టీజర్

తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ – స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం సర్కార్. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. విజయ్ 62 వ సినిమా గా సర్కార్ రావడం , మురుగదాస్ – విజయ్ కాంబోలో సినిమా వస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆలా విడుదల అయ్యిందో లేదో నెటిజన్లు , అభిమానులు , సినీ ప్రేక్షకులు ఈ టీజర్ ను చూసేందుకు పోటీ పడ్డారు. దీంతో అతి తక్కువ టైములోనే రికార్డ్స్ వ్యూస్ వచ్చి వార్తల్లో నిలిచింది.

సన్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నుండ‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా పని చేస్త్తుండగా , ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్‌ 6న‌ ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.