సీత న్యూ రిలీజ్ డేట్..

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చిన తేజ..తాజాగా బెల్లం కొండ శ్రీనివాస్ తో సీత అనే సినిమా చేస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన..తాజాగా సినిమా వాయిదా పడింది.

ఏప్రిల్ 25 న ఎవెంజర్స్ -ఎండ్ గేమ్ భారీ స్థాయిలో విడుదలవుతుండడం అలాగే జెర్సీ, కాంచన 3 , మజిలీ , చిత్రలహరి చిత్రాలు పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం తో సీత కు థియేటర్లు దొరకడం లేదట. దీంతో సినిమాను మే 24 కు వాయిదా వేసినట్లు సమాచారం. మన్నార చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.