సీటీమార్‌ షూటింగ్ స్టార్ట్

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ కు ఈ మధ్య ఒక్క హిట్ అనేది కూడా ..హిట్ మాట అటుచ్చి కనీసం పబ్లిసిటీ ఖర్చులు అంత కూడా రాబట్టలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న సిటీమార్ సినిమా ఫైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. మ్యాచోస్టార్‌ గోపీచంద్‌..తమన్నా జంటగా సంపత్ నంది డైరెక్షన్లో సీటీమార్ అనే స్పోర్ట్స్ నేపధ్య మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ లో గోపిచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తుండగా.. తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తోంది. ఇక ఈరోజు నుండి ఈ చిత్ర షూటింగ్ పున: ప్రారంభం అయ్యింది. ప్రొడ‌క్ష‌న్ టీం స్పెష‌ల్ గా వేసిన సెట్ లో చేస్తున్న‌ ఏర్పాట్ల‌కు సంబంధించిన వీడియోను బీఏ రాజు ట్విట‌ర్ లో షేర్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తున్న ఈ మూవీని శ్రీనివాస చిట్టూరినిర్మిస్తున్నారు.

We’re BACKK!!!#Seetimaarr shoot Resumes @YoursGopichand @IamSampathNandi @tamannaahspeaks @SS_Screens @DiganganaS @bhumikachawlat @actorrahman @TarunRajArora @soundar16 #Manisharma pic.twitter.com/LsanExr3th— Srinivasaa Silver Screen (@SS_Screens) November 23, 2020