శర్వానంద్ కు సీరియస్..

టాలీవుడ్ హీరోలను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి..రోజుకో ఏదో ఓ హీరో కు ప్రమాదం జరగడం అభిమానులను కలవరపాటుకు గురి చేస్తుంది. ఏ రోజు ఏ హీరో గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడిపోతున్నారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ , నాని , సందీప్ కిషన్ ఇలా పలువురికి షూటింగ్ లలో ప్రమాదాలు జరుగగా..తాజాగా హీరో శర్వానంద్ కు పెద్ద ప్రమాదమే జరిగినట్లు తెలుస్తుంది.

శర్వానంద్ ప్రస్తుతం తమిళ సినిమా 96 రీమేక్ లో దిల్ రాజు నిర్మాణంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ బ్యాంకాక్ లో జరుగుతోంది. అక్కడ స్కై డైవింగ్ సీన్లు కొన్ని చిత్రీకరించాల్సి వుంది. అందుకోసం స్కై డైవింగ్ సీన్ల ప్రాక్టీస్ ను మూడు రోజుల పాటు ట్రయినర్ల సాయంతో చేసారు. మూడుసార్లు బాగానే లాండ్ అయ్యాడు. నాలుగోసారి లాండ్ అవుతున్నపుడు గాలి విపరీతంగా వీచడంతో కాళ్ల మీద బదులు షోల్డర్ మీద లాండ్ అయిపోయాడు. దాంతో షోల్డర్ డిస్ లోకేట్ అయినట్లు తెలుస్తోంది. అదే విధంగా కాలికి ఫ్యాక్చర్ అయినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫ్లయిట్ లో హైదరాబాద్ కు తీసుకువచ్చేసారు. శర్వాని పరీక్షించిన డాక్టర్స్ షోల్డర్ కు సర్జరీ అవసరం వుంటుందని అన్నారట. ఆ తరువాత నాలుగయిదువారాల పాటు రెస్ట్ అవసరం వుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.