శ్యామ్ ‌సింగ రాయ్‌ కథ అదేనా..?

నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాతతరం కలకత్తా నేపథ్యంలో సాగుతుంది. అందుకే హైదరాబాద్ లోని అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా కలకత్తా నేపధ్య సెట్ వేసి సిద్ధం చేసారు.

ఈ మూవీ లో నాని త్రిపాత్రాభినయంలో నటించనున్నారని.. అందులో ఒకటి 65ఏళ్ల ముసలాడి పాత్ర అని సమాచారం. ఇదిలా ఉంటె ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంగా ఉంటుందట. హైదరాబాద్‌, కోల్‌కత్తా నేపథ్యాలతో రెండు ప్రేమకథలు ఉంటాయి. అందులో కోల్‌కత్తాలో సాగే ప్రేమకథకు లింక్‌గా హైదరాబాద్‌ ప్రేమకథ ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. సాయిపల్లవి, క్రితిశెట్టి ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నాని తన కెరీర్‌లో తొలిసారి పునర్జన్మల నేపథ్యంలో చేయనున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.