హాట్ బ్యూటీ ఫై దాడి..

సోషల్ మీడియా లో సోఫియా హయత్ తెలియని నెటిజన్ ఉండడు..హాటెస్ట్ ఫోటో షూట్స్ తో ఎప్పుడు తన అందాలతో చూపరులకు కనువిందు చేసే ఈ హాట్ బ్యూటీ ఫై దాడి జరిగింది. లండన్ లో ఓ పార్క్ లో నడుకుంటూ వెళ్తున్న సమయం లో ఒక వ్యక్తి దాడి చేసినట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే..

తాను పార్క్ లో నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకు కాస్త దూరంలో ఒక వ్యక్తి మహిళను వేదిస్తున్నాడు. ఆమెను ఆ వ్యక్తి కొడుతుండటంతో తాను చూస్తూ ఊరుకోలేక పోయాను. అక్కడకు వెళ్లి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాను. అతడిని పక్కకు తోసేసి ఆమెను కాపాడాను. ఆసమయంలోనే అతడు నన్ను టార్గెట్ చేశాడు. నా మొహంపై గుద్దడంతో పాటు నన్ను చేతులు కాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.

నేను అతడిని బలవంతంగా కింద పడేసి వెంటనే పోలీసులను పిలిచాను. దాంతో అతడు అక్కడి నుండి పారిపోయాడు. ఆ వ్యక్తి పారిపోయినా కూడా కొద్ది సేపట్లోనే పోలీసులు అతడిని పట్టుకుని జైల్లో వేశారు..అని చెప్పుకొచ్చింది.