ఎమ్మెల్యే టికెట్ ఫై సోనూసూద్ ఏమన్నాడో తెలుసా…?

అరుంధతి చిత్రంలో పశుపతి గా అందర్నీ మెప్పించిన సోనూసూద్‌..లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక అప్పటినుండి ప్రతి రోజు ఎవరు ఏ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈయన చేస్తున్న మంచి పనులకు ప్రతి ఒక్కరు అభిమానులు అవుతున్నారు.

కొందరు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను సోనూకు విన్నవించుకుని సహాయం అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఫన్నీ ట్వీట్లు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని సోనూను కోరాడు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని అడిగాడు.

దీనికి స్పందించిన సోనూ చాల ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. బస్సు, రైలు, విమానం టికెట్లు తప్ప వేరే టికెట్లు ఇప్పించడం తెలియదు బ్రదర్ అని రిప్లై ఇచ్చాడు. సోనూ రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

बस, ट्रेन और प्लेन की टिकट के इलावा मुझे कोई टिकट दिलवाना नहीं आता मेरे भाई। ?? https://t.co/qULDxegoLW— sonu sood (@SonuSood) September 16, 2020