తేజస్వి లవర్ ను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి..

శ్రీ రెడ్డి..ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కాస్టింగ్ కౌచ్ అంటూ అర్ధనగ్న ప్రదర్శన చేసి ఎంతటి రచ్చ చేసిందో తెలియంది కాదు. ఆ తర్వాత కొంతమంది ని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. కొన్ని రోజులుగా తెలుగు బిగ్ బాస్ 2 హోస్ట్ చేస్తున్న హీరో ను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత నాని లీగల్ నోటీసులు చేయడం తో కాస్త తగ్గింది.

తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్స్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ పాపులర్ పార్టిసిపేట్స్ గా సామ్రాట్, తేజస్వి ఉన్న సంగతి తెల్సిందే. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అంత మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటె శ్రీ రెడ్డి సామ్రాట్‌ను టార్గెట్ చేసింది. ఆయనతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను తన పేస్ బుక్ ద్వారా బయటపెట్టింది.

‘ఫేస్ బుక్ పోస్టులో.. సామ్రాట్ రెడ్డి వెడ్స్ శ్రీ రెడ్డి.. ఫన్ ఇన్ బిగ్ బాస్ రా.. ఆఫర్ పేరు చెప్పి వాడుకొని.. నా సంగతేంది రా అంటే.. ….లేక మంగళవారం అన్నాడంటా. మీ ఆవిడ రెడీ రా. బయటకు రా చెప్పులు, చీపుర్లతో రెడీగా ఉంటాం’అంది. బిగ్‌బాస్‌లో ఉన్న సామ్రాట్‌పై ఇలా ఓ రేంజ్‌లో విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సామాట్ర్ మాత్రమే కాదు గతంలో లీక్స్ పేరుతో చాలామందిని శ్రీరెడ్డి టార్గెట్ చేసింది. అందరి బాగోతాలు తన దగ్గరున్నాయంటూ.. సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ .. ఇలా ఒక్కొక్కరికి సంబంధించిన వివరాలను బయటపెడుతోంది. మరి నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తుందో చూడాలి.